Header Banner

సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!

  Wed May 14, 2025 19:16        India

సింధూ నదీ జలాల ఒప్పందం విషయంలో ఇదివరకు దూకుడుగా వ్యవహరించిన పాకిస్థాన్ వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఒప్పందాన్ని నిలిపివేస్తే ఎదురయ్యే తీవ్ర పరిణామాలను గ్రహించిన ఆ దేశం, ఈ అంశంపై తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని భారత్‌ను అభ్యర్థించింది. సింధూ జలాల విషయంలో తగ్గేది లేదని భారత్ పదేపదే తేల్చి చెప్పడంతో పాకిస్థాన్ తానే వెనక్కి తగ్గింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. సింధూ నదీ జలాలను భారత్ నిలిపివేస్తే తమ దేశంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ, భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాసినట్లు సమాచారం.

ఈ సున్నితమైన అంశంపై చర్చలు జరిపేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని ఆ లేఖలో పేర్కొంది. నిబంధనల ప్రకారం, ఈ లేఖను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో భారత్ తన వైఖరిని ఇదివరకే స్పష్టం చేసింది. "రక్తం, నీరు రెండూ ఏకకాలంలో ప్రవహించలేవు" అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలోనే తేల్చిచెప్పారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే అవి కేవలం ఉగ్రవాదం నిర్మూలన, పీవోకేకు సంబంధించిన అంశాలపైనే ఉంటాయని స్పష్టం చేశారు. సింధూ జలాల ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండిఏపీలో ఇకపై ఆ రూల్స్ పాటించాల్సిందే..! ప్రభుత్వం కీలక ఆదేశాలు..!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..


 నేడు (14/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #IndusWaters #PakistanBacksDown #IndiaStrong #WaterDiplomacy #IndusTreaty #PakIndiaTensions